Friday, 16 October 2026

అన్న‌దాత‌ల‌కు వ‌రం రైతు భ‌రోసా ప‌థ‌కం

newsseals-CM

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారాయ‌న్నారు. పంట పొలాలు, రైతుల జీవితాలు నిత్యం పచ్చగా ఉండాలన్న ఆశయంతో స‌ర్కార్ ప్రారంభించి రైతు భ‌రోసా ప‌థ‌కం రైత‌న్న‌ల పాలిట వ‌రంగా మారింద‌న్నారు. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదని, తెలంగాణ వ్యవసాయ చరిత్రను దేశానికే ఆదర్శంగా మార్చిన విప్లవం అని అభివ‌ర్ణించారు రేవంత్ రెడ్డి.

ప్రతి సీజన్ లో తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలకు చేర్చే మహా సంకల్పం అని అన్నారు. అందులో భాగంగా నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్ల కాటారం మండలం నస్తూరపల్లిలో వేలాది మంది రైతుల సమక్షంలో మలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేశామ‌న్నారు. తొలి, మలి విడతల్లో కలిపి ఇప్పటి వరకు రూ.5,700 కోట్లు రైతన్నల ఖాతాల్లో జమ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *