Friday, 16 October 2026

ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

newsseals-GirisshMahajan

మ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్

ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు. నిన్న, ఒక బిల్లు ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మహిళలు ఒక ‘జన ఆక్రోష్ మోర్చా’ (ప్రజా ఆగ్రహ యాత్ర)ను నిర్వహించార‌ని చెప్పారు. ఇందులో మా సోదరీమణులు వేల సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. అయితే, రోడ్డుపై ఇటువంటి యాత్ర జరిగినప్పుడు, అది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఈ సందర్భంలో వర్లి వైపున కు సాగుతున్నప్పుడు, రోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలగడం సహజం అని స్ప‌ష్టం చేశారు.

దీని ప‌ట్ల మేము ఆలోచ‌న చేయ‌డం జ‌రిగింద‌న్నారు. తాము ముందే పర్మిష‌న్ తీసుకుని నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు గిరీష్ మ‌హాజ‌న్. ఏ నిరసనలోనైనా కొంత అసౌకర్యం తప్పదని అన్నారు. అయినప్పటికీ, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఒక సరైన పద్ధతి ఉంటుందన్నారు. ఆ సందర్భంలో ఉపయోగించిన భాష మాత్రం అనుచితమని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు మంత్రి. రోడ్డును 10 నిమిషాల్లోనే క్లియర్ చేస్తామని, భవిష్యత్తులో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మేము వారికి తెలియజేశామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *