త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

ఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం

త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కున్నారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌ముఖ న‌టులు గౌత‌మి, ఖుష్బు, సుంద‌ర్ , రాజ్య స‌భ స‌భ్యుడు క‌మ‌ల్ హాస‌న్ , కూతురు శ్రుతి హాస‌న్ తో పాటు అన్నాడీఎంకే పార్టీ చీఫ్ తో పాటు టీవీకే పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ ఇవాళ త‌మ విలువైన ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు మ‌రో అగ్ర న‌టుడు త‌లైవా ర‌జ‌నీకాంత్ , ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం, ఆయ‌న భార్య‌, న‌టి సుహాసిని కూడా ఓటు వేశారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో 234 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ జ‌రుగుతోంది. 5 కోట్ల‌కు పైగా ప్ర‌జ‌లు ఓటు హ‌క్కు క‌లిగి ఉన్నారు. ఇక సెన్సేష‌న్ గా మారారు టీవీకే విజ‌య్. ఆయ‌న ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న డీఎంకే , ఇండియా కూట‌మితో పాటు అన్నాడీఎంకే, బీజేపీ ఎన్డీయే కూట‌మితో పోటీ ప‌డుతున్నారు. ఈసారి త‌మిళ‌నాడు రాష్ట్రంలో విజ‌య్ కేంద్ర బిందువుగా మారారు. అంద‌రి క‌ళ్లు ఇప్పుడు త‌మిళ‌నాడుపై ఉన్నాయి. ఏ మేర‌కు టీవీకే ప్ర‌భావం చూప‌గ‌ల‌ద‌నే దానిపై రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ కొన‌సాగుతోంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *