ఏపీ సీఎంతో బిట్స్ పిలానీ ప్ర‌తినిధులు భేటీ

రూ. 200 కోట్ల‌తో అమ‌రావ‌తిలో క్యాంప‌స్ నిర్మాణం

అమ‌రావ‌తి : భార‌త దేశంలో విద్యా ప‌రంగా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది బిట్స్ పిలానీ క్యాంప‌స్, యూనివ‌ర్శిటీ. ఈ సంద‌ర్బంగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా బిట్స్ పిలానీ క్యాంప‌స్ ను నిర్మించ‌నుంది. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వంతో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న ఒప్పందం చేసుకుంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఖ‌ర్చు చేస్తోంది. యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మాణం ప‌నులు చేప‌డుతోంది. ప‌నుల ప్ర‌గ‌తికి సంబంధించి బిట్స్ పిలానీ ప్ర‌తినిధులు ఇవాళ ఏపీ సీఎం తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు రాష్ట్ర స‌చివాల‌యంలోని సీఎం క్యాంపు ఆఫీసులో.

రాజధాని అమరావతి ప్రాతంలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మితం అవుతున్న బిట్స్ పిలాని క్యాంపస్ పురోగతిని వారు వివరించారు సీఎంకు. 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభించే ఈ క్యాంపస్ లో క్వాంటం, ఏఐ విభాగాలు కూడా ఉంటాయని చెప్పారు. మూడు దశల్లో నిర్మాణమయ్యే ఈ క్యాంపస్ లో మొత్తం 10 వేల మంది విద్యార్ధులు చదువుకునే వీలు క‌లుగుతుంద‌ని వెల్ల‌డించారు బిల్స్ పిలానీ ప్ర‌తినిధులు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు. ప్ర‌భుత్వం అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌తినిధుల‌కు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *