ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
బెంగళూరు : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇండియా కూటమి తరపున పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇండియా కూటమిలోని ఆయా పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. తమిళనాడులో ఈనెల 23న పోలింగ్ ముగిసింది. మొత్తం 234 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్ లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. తొలి విడతలో 16 జిల్లాల్లో 156 శాసన సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. కొన్ని అల్లర్లు చోటు చేసుకున్నా పోలింగ్ ముగిసింది.
ఈ సందర్బంగా స్పందించాడు డీకే శివకుమార్. మా ఎన్నికల ప్రక్రియ పూర్తయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తమిళనాడు, కేరళ, కర్ణాటక , అసోంలలో ఎన్నికలు ముగిశాయన్నాడు. నిన్న మేము అసోం నాయకులతో ఒక ‘జూమ్’ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపాడు డీకే శివకుమార్. కేరళ, తమిళనాడులలో మా కూటమి భాగస్వామ్యంతో మేము 100% ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశాడు. తమ కూటమికి పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయని తెలిపాడు.





