Friday, 16 October 2026

కంపెనీల ఎంఈవోల పురోగ‌తిపై దృష్టి సారించాలి

newsseals-RevanthReddy

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ఎడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పరిశ్రమల శాఖ పై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దావోస్ పర్యటనలో, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో జరిగిన MOU లు, పురోగతిపై ఆరా తీశారు. ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. MOU లు కుదుర్చుకున్న కంపెనీలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి, ప్రాధాన్యత క్రమంలో భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని ఆదేశించారు సీఎం.

డేటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని స్ప‌ష్టం చేశారు. MOU లు కుదుర్చుకున్న సంస్థలు వీలైనంత త్వరగా తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని అన్నారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *