చెన్నై సూప‌ర్ కింగ్స్ జోష్ ఫ్యాన్స్ ఖుష్

VijayaBhaskar · April 24, 2026
Spread the love

ముంబై ఇండియ‌న్స్ పై గ్రాండ్ విక్ట‌రీ

ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో స‌త్తా చాటింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్. టాస్ ఓడి పోయి ముందు బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 207 ప‌రుగులు చేసింది. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ సూప‌ర్ గా ఆడాడు. కేవ‌లం 54 బంతులు మాత్ర‌మే ఆడాడు. త‌ను 101 ప‌రుగుల‌తో అజేయంగా నిల‌బ‌డ్డాడు. ఇందులో 10 ఫోర్లు 6 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. 208 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ ఏ కోశాన పోరాటం చేయ‌లేదు.

ప్ర‌ధానంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిస్సైల్స్ లాంటి బంతుల‌తో హోరెత్తించారు. ప్ర‌ధానంగా అకీల్ హుసేన్, నూర్ అహ్మ‌ద్ , ఓవ‌ర్ట‌న్ , సింగ్ ల బౌలింగ్ లో ఆడేందుకు టాప్ బ్యాట‌ర్లు నానా తంటాలు ప‌డ్డారు. హుసేన్ 4 ఓవ‌ర్లు వేసి 17 ర‌న్స్ ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. నూర్ అహ్మ‌ద్ 2 వికెట్లు తీశాడు. ఈ త‌రుణంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు గ్రాండ్ విక్ట‌రీ సాధించ‌డంలో ముఖ్య‌మైన భూమిక పోషించాడు సంజు శాంస‌న్. త‌ను ఆడిన‌ప్పుడ‌ల్లా ఆ జ‌ట్టు గెలుస్తూ వ‌స్తోంది. దీంతో త‌న సెంచ‌రీని పుల్ ఎంజాయ్ చేశారు ప‌సుపు ఫ్యాన్స్ ఆర్మీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.