శ్రీవారికి బంగారు పతకాలు విరాళం

VijayaBhaskar · April 24, 2026
Spread the love

వీటి విలువ రూ. 94.80 ల‌క్ష‌లు

తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు బంగారు పతకాలను అందజేశారు. ఈ సంద‌ర్బంగా దాత‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు ఈవో ర‌విచంద్ర‌. ఇదిలా ఉండ‌గా కోట్లాది మంది భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని కొలుస్తారు. నిత్యం స్మ‌రిస్తూనే ఉంటారు.

ప్ర‌పంచంలో అత్య‌ధికంగా ఆదాయం క‌లిగిన దేవాల‌యాల‌లో తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం కూడా ఉంది. భ‌క్తులు నిత్యం సంద‌ర్శిస్తుంటారు ఈ ఆల‌యాన్ని. స్వామి వారిని పూజిస్తారు. ఈ సంద‌ర్బంగా త‌మ కోరిక‌లు తీరితే ముడుపులు చెల్లిస్తామ‌ని మొక్కుకుంటారు. ఇందులో భాగంగా కోరిన కోర్కెలు తీరిన వెంట‌నే తిరుమ‌ల‌కు వ‌చ్చి చెల్లించుకుంటారు. ఇప్ప‌టికే వేల కోట్ల రూపాయ‌లు క‌లిగి ఉన్న‌ది ఈ ప‌విత్ర‌మైన పుణ్య క్షేత్రం. ప్ర‌తి రోజూ రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వ‌ర‌కు హుండీ ఆదాయం వ‌స్తోంది. ప‌లు ట్ర‌స్టుల ద్వారా ఖ‌ర్చు చేస్తోంది టీటీడీ.