3 కోట్ల మందికి అమ్మ‌ను అవుతా : క‌ల్వ‌కుంట్ల క‌విత

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ (టీజేఎస్) అధ్య‌క్షురాలు, మాజీ శాస‌న మండ‌లి స‌భ్యురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం తాను కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. భారీ జ‌నం మ‌ధ్య ఆమె ఈ కీల‌క ప్ర‌క‌ట‌న వెల్ల‌డించారు. తెలంగాణ రాజ‌కీయాల‌లో ఆమె చేసిన తాజా ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఒక మ‌హిళ రాజ‌కీయ పార్టీని స్థాపించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఆమె బ‌తుక‌మ్మ పండుగ‌కు శాశ్వ‌త గుర్తింపు తీసుకు వ‌చ్చేలా చేశారు.

హైదరాబాద్‌లో కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ను ప్రారంభించారు. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరైన ఒక బహిరంగ సభలో ఈ ప్రకటన వెలువడింది. సభికులను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు, ఆమె సభా ప్రాంగణంలో తెలంగాణ అమరులకు, తెలంగాణ తల్లికి , ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించారు.
కవిత అధికారికంగా పార్టీని ఆవిష్కరించడంతో, ఈ కార్యక్రమం తెలంగాణ రాజకీయాల్లో ఒక నూతన పరిణామానికి నాంది పలికింది. ఇదే స‌మ‌యంలో త‌న తండ్రి స్తాపించిన బీఆర్ఎస్ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ లో తెలంగాణ ఆత్మ కోల్పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *