చుక్క‌లు చూపించిన సాయి సుద‌ర్శ‌న్

VijayaBhaskar · April 27, 2026
Spread the love

ఆడుతూ పాడుతూ గెలుపొందిన గుజ‌రాత్

చెన్నై : స్వంత మైదానం చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు అంత‌గా స‌హ‌క‌రించ‌డం లేదు. ఆడిన మ్యాచ్ లో ఆశించిన ప‌ర్ ఫార్మెన్స్ ఆ జ‌ట్టు నుంచి రావ‌డం లేదు. ముంబై ఇండియ‌న్స్ తో సెంచ‌రీ చేసిన సంజు శాంస‌న్ గుజ‌రాత్ తో తేలి పోయాడు. ఇక మిగ‌తా ఆటగాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ లేదు. చివ‌ర‌కు క‌నీసం 100 ర‌న్స్ అయినా చేస్తుందా లేదా అని ఆందోళ‌న‌కు గుర‌య్యారు చెన్నై అభిమానులు. ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్లు. ర‌బాడా, అర్ష‌ద్ ఖాన్ లు క‌ళ్లు చెదిరే బంతుల‌తో ఇక్క‌ట్ల‌పాలు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 158 ర‌న్స్ చేసింది. ఒక ర‌కంగా ప‌రువు పోకుండా కాపాడాడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. త‌ను 74 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

అనంత‌రం మైదానంలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఆడుతూ పాడుతూ టార్గెట్ ను పూర్తి చేసింద మొదట్నుంచే గిల్‌, సుదర్శన్‌ ప్రత్యర్థి బౌలర్లపై సిక్స్‌లు, బౌండరీలతో విరుచుకు ప‌డ్డారు. ఆ జట్టు గెలుపునకు మంచి ఆరంభాన్ని అందించారు. మూడు సిక్స్‌లతో జోరుమీద కనిపించిన గిల్‌ను నూర్‌ తన తొలి ఓవర్లోనే బోల్తా కొట్టించడంతో టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ నిష్క్రమించినా ఆ ప్రభావం ఛేదనపై పడకుండా బట్లర్‌ అండతో సాయి రెచ్చిపోయాడు.