ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టుకు విరామం కావాలి

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ రిష‌బ్ పంత్

ల‌క్నో : ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ లీగ్ కీల‌క మ్యాచ్ ఆద్యంత‌మూ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ 8 వికెట్లు కోల్పోయి 155 ర‌న్స్ చేసింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్క‌డా త‌ల‌దించ‌కుండా అద్భుతంగా ఆడాడు జ‌ట్టు కోసం యంగ్ క్రికెట‌ర్ రింకూ సింగ్ . త‌ను 83 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంత‌రం ల‌క్నో జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 155 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. దీంతో సూప‌ర్ ఓవ‌ర్ అవ‌స‌ర‌మైంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఎల్ఎస్జీ కేవ‌లం ఒకే ఒక్క ర‌న్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన రింకూ సింగ్ తొలి బంతికే ఫోర్ బాదాడు. కోల్ క‌తాకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు.

ఈ సంద‌ర్బంగా ల‌క్నో జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మాకు కచ్చితంగా ఒక విరామం అవసరమని నేను భావిస్తున్నాను. ఈ విరామం మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఒత్తిడి అనేది ఎప్పుడూ ఉంటుంది, ప్రతి మ్యాచ్ కూడా ఒత్తిడితో కూడుకున్నదే అవుతుంది; అయితే అదే సమయంలో, మనం పరిష్కారాల కోసం బయట కాకుండా, మనలోనే వెతుక్కోవాలి అని అన్నాడు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తామే స్వీకరించాలి. ఇది కేవలం ఒకరిద్దరికి సంబంధించిన విషయం కాదు; ఇది జట్టు మొత్తానికి సంబంధించిన విషయం. నిస్సందేహంగా, చాలామంది ఆటగాళ్లు ఈ బాధ్యతను స్వీకరిస్తారని అన్నాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *