newsseals.com
News

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల‌కు ఖుష్ క‌బ‌ర్

VijayaBhaskar May 2, 2026
newsseals-RTCCM
Spread the love

కేసులు ఎత్తివేత‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓకే

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ఆయా కార్మిక సంఘాల నేత‌లు చేసిన విన‌తుల‌ను సావ‌ధానంగా విన్నారు. ఈ మేర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నార‌ని, వారు పోషించిన పాత్ర అద్భుత‌మ‌ని కొనియాడారు సీఎం.

వారు చేసిన త్యాగాలు, ఆత్మ బ‌లిదానాలు, ఆందోళ‌న‌ల కార‌ణంగానే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు రేవంత్ రెడ్డి. 3 రోజుల వేతనం ఇచ్చేందుకు, కేసుల ఎత్తివేతకు అంగీకరించినట్లు ప్ర‌క‌టించారు. సమ్మె కాలంలో వేతనం ఇస్తామ‌ని, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.