తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

VijayaBhaskar · May 2, 2026
Spread the love

ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించిన స్వామి

తిరుమ‌ల : తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియ జెబుతున్నాడు.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథంతో, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల‌ను అభివృద్ది చేసేందుకు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ ర‌విచంద్ర చ‌ర్య‌లు చేప‌ట్టారు.