త‌మిళ‌నాడులో హంగ్ ఏర్ప‌డే ఛాన్స్

అప్ర‌మ‌త్త‌మైన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్

చెన్నై : గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. ఈనెల 4వ తేదీన సోమ‌వారం రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు సంబంధించి 234 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన తుది ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు టీవీకే విజ‌య్ ఈసారి రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సెన్సేష‌న్ సృష్టించారు. సుడిగాలి ప‌ర్య‌ట‌నలు చేప‌ట్టారు. పెద్ద ఎత్తున ప్ర‌చారంలో కొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టారు.

ఇక ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఈసారి ఆశించిన దానికంటే ఫ‌లితాలు భిన్నంగా ఉండ బోతున్నాయ‌ని ఎగ్జిట్ పోల్స్ ప్ర‌క‌టించాయి. దీంతో అంద‌రి క‌ళ్లు ఇప్పుడు త‌మిళ‌నాడుతో పాటు ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో వెలువ‌డే ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై నెల‌కొన్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కూడా చోటు చేసుకున్న‌ట్లు స‌మాచారం. మ‌రో వైపు త‌మిళ‌నాట హంగ్ వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని పేర్కొన‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌హాబ‌లిపురంలో రిసార్ట్ బుక్ చేశారు. గెలిచిన వెంట‌నే అభ్య‌ర్థులు నేరుగా పార్టీ ఆఫీసుకు రావాల‌ని ఆదేశించారు విజ‌య్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *