newsseals.com
News

రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటా

VijayaBhaskar May 5, 2026
newsseals-TVKVijayLetter
Spread the love

గవ‌ర్న‌ర్ రాజేంద‌ర్ కు లేఖ రాసిన టీవీకే విజ‌య్

త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడు లో ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. ఈ సంద‌ర్బంగా మ్యాజిక్ ఫిగ‌ర్ కు కొద్ది సీట్ల తేడాతో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది టీవీకే పార్టీ. అరుదైన న‌టుడు విజ‌య్ సారథ్యంలో గ‌త రెండు సంవ‌త్స‌రాల కింద‌ట ఇది ఏర్ప‌డింది. ఊహించ‌ని రీతిలో 234 సీట్ల‌కు గాను 108 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. ఏకైక అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం ముందుగా అత్య‌ధిక సీట్లు సాధించిన పార్టీని పిల‌వాల్సి ఉంటుంది. దీంతో భారీ సీట్ల‌ను గెలుచుకున్న టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ స్పందించారు. ఆయ‌న మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ మేర‌కు తమిళనాడు గవర్నర్ రాజేంద్రకు లేఖ రాశారు టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్. రాష్ట్రంలో తనకే అత్యధిక సీట్లు వచ్చాయని, రెండు వారాల్లో మెజారిటీ (118)ని నిరూపించుకుంటానని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 108 సీట్లు దక్కించుకున్న విజయ్ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్లు అవసరం కావాల్సి ఉంది. దీంతో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. మ‌రో వైపు ఎన్నిక‌ల సంద‌ర్భంగా పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ తో ఆస‌క్తి చూపించారు విజ‌య్. కానీ ఆ పార్టీ ఒప్పుకోలేదు. ఇదిలా ఉండ‌గా విజ‌య్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు రాహుల్ గాంధీ.