Friday, 16 October 2026

పుట్టప‌ర్తిలో యుద్ద విమానాల త‌యారీ ప‌రిశ్ర‌మ‌

newsseals-SSavitha

సీఎం చంద్రబాబుకు స‌విత ధన్యవాదాలు

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా : ఏపీ మంత్రి స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనున్నట్లు తెలిపారు. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ రాకతో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఇప్పటికే కియా, బెల్ వంటి పరిశ్రమలు వచ్చాయన్నారు. తాజాగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ రానుండడంతో, ఈ ప్రాంతం రూపు రేఖలే మారిపోనున్నాయన్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడిని కొనియాడారు. సోమందేపల్లి, సత్యసాయి జిల్లాల తరఫున సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతకు ముందు బీటీ రోడ్ల ప్రారంభొోత్సవానికి విచ్చేసిన మంత్రి సవితకు బూచేపల్లి వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్మామ్ ప్రసాద్. ఇతర అధికారులు, ఉద్యోగులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *