Friday, 16 October 2026

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ నెర‌వేరింది

newsseals-APCM

గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

అమరావతి : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను.

2026, జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు సీఎం. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహద పడుతుందన్నారు చంద్ర‌బాబు నాయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *