ఒత్తిడిని త‌ట్టుకుని ఆడ‌డంలో శాంస‌న్ బెస్ట్

ర‌విచంద్ర‌న్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్

చెన్నై : ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును త‌మ స్వంత గ‌డ్డ‌పై ఉతికి ఆరేసింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కో ల్పోయి 155 ర‌న్స్ చేసింది. అనంత‌రం 17.3 ఓవ‌ర్ల‌లో సీఎస్కే కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈసారి సూప‌ర్ షో చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను కేవ‌లం 52 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌ను 87 ర‌న్స్ చేసి అజేయంగా నిలిచాడు. మ‌రో వైపు కార్తీక్ శ‌ర్మ 47 ర‌న్స్ చేసి తోడుగా నిలిచాడు.

మ్యాచ్ విన్నింగ్ లో కీల‌క పాత్ర పోషించిన సంజు శాంస‌న్ ప్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు పొందాడు . ఈ సందర్భంగా స్పందించాడు మాజీ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్. సంజు సామ్సన్ ఇప్పుడు ఒక క్లచ్ ప్లేయర్. ఒత్తిడి వచ్చినప్పుడల్లా, అతను ముందుకు వచ్చి రాణిస్తాడు. ఇది అతని కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన ఐపీఎల్ సీజన్ కావచ్చు. అతను ప్రతి సంవత్సరం 500 పరుగులు చేసే ఆటగాడు కాదు, కానీ ఈసారి అది ఖాయంగా కనిపిస్తోంది. గత 18 నెలల్లో, అతను పూర్తిగా మారి పోయాడని ప్ర‌శంసించాడు.
అతను కఠినమైన వికెట్లపై ఇబ్బంది పడ్డాడు, కానీ ఈరోజు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆ అడ్డంకిని అధిగమించాడు. ఇక్కడి నుండి, అతను మరింత ప్రమాదకరంగా మారతాడు .

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *