సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న విజ‌య్

త‌మిళ‌నాడు లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు

చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చినా ప్ర‌భుత్వం ఏర్పాటులో ఇంకా అనిశ్చితి కొన‌సాగుతూనే ఉంది. 243 స్థానాల‌కు గాను 108 సీట్లు సాధించింది ఒంట‌రిగా టీవీకే విజ‌య్. మ‌రో వైపు డీఎంకే, అన్నాడీఎంకే, క‌మ్యూనిస్టు, ఇత‌ర పార్టీలు ఇప్పుడు కీల‌కంగా మారాయి. ఎవ‌రితో పొత్తు ఉంటుంద‌నే దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. మ‌రో వైపు టీవీకే పార్టీకి బేష‌ర‌తు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టిచింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేర‌కు లెట‌ర్ కూడా ఇచ్చింది. అయితే విజ‌య్ ప‌వ‌ర్ లోకి రాకుండా గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్ట‌డంలో అది మొద‌టి నుంచి ప్ర‌య‌త్నం చేస్తూనే వ‌చ్చింది. తాజాగా విజ‌య్ కి షాక్ ఇస్తూ గ‌వ‌ర్న‌ర్ ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయాలు ప్రారంభించింది

దీంతో ప్ర‌భుత్వం ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన ప్ర‌కారం ఎక్కువ సీట్లు క‌లిగిన పార్టీకి ప్ర‌యారిటీ ఇవ్వాల్సిన బాధ్య‌త రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ పై ఉంటుంది. కానీ ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ కేంద్రం చేతిలో కీలుబొమ్మ‌. దీంతో రోజు రోజుకు తమిళనాడు రాజకీయాలు మరో మలుపులు తిరుగుతున్నాయి. ఈ మేర‌కు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని టీవీకే చీఫ్‌ విజయ్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన తమిళనాడు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఆ సమావేశం అనంతరం కోర్టుకు వెళ్లే యోచనపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *