హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పండి

కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో సీఎం రేవంత్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర పట్టణాభివృద్ధి వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌ ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్‌-II డీపీఆర్‌ను ఇప్ప‌టికే కేంద్రానికి సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II, ఫేజ్‌-III విస్త‌ర‌ణ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్‌-Iను L&TMRHLను రాష్ట్ర ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంద‌ని కేంద్ర మంత్రికి వివ‌రించారు అనుముల రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II ప్రాజెక్ట్ ను భారత ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచ‌ర్ గా చేప‌ట్టేందుకు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని కోరారు. కాగా హైద‌రాబాద్ న‌గ‌ర భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా RGIఎయిర్‌పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్-IIIగా చేపట్టాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించడం జ‌రిగింద‌న్నారు సీఎం. ఆయ‌న కేంద్ర మంత్రితో క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. మెట్రో ఫేజ్-III కి సంబంధించిన డీపీఆర్ ను కూడా ఇప్ప‌టికే స‌మ‌ర్పించామ‌ని వెల్ల‌డించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *