కమ్యూనిస్టు ముక్త భారత్ దిశగా దేశం

భార‌తీయ జ‌న‌త‌తా పార్టీ నేత‌ విష్ణువర్ధన్ రెడ్డి

అనంత‌పురం జిల్లా : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దేశ ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్టు రహిత భారతాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుండటంతోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించిందని తెలిపారు. సుమారు 50 సంవత్సరాల తర్వాత దేశంలో ఒక్క కమ్యూనిస్టు ముఖ్యమంత్రి కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే నిజమైన కమ్యూనిస్టు ముక్త భారత్‌కు సంకేతం అని పేర్కొన్నారు.

పశ్చిమ గాల్ రాజకీయాలపై స్పందిస్తూ, ప్రజల తీర్పును గౌరవించాలని మమతా బెనర్జీ ని కోరారు. అయితే రాజీనామా చేయబోనని ఆమె చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అని, అది రాజకీయ పరిపక్వత లేమిని సూచిస్తుందని విమర్శించారు. దేశ రాజకీయాల్లో బాధ్యతాయుత వైఖరి అవసరమని, ప్రజల తీర్పును గౌరవించడం ప్రతి పార్టీ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు బూదిలి సుదర్శన్, కొండమరాజు కత్తి రాజారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జ్యోతి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమలేషు, కిసాన్ మోర్ఛా ప్రధాన కార్యదర్శి బాల గంగాధర్, పట్టణ అధ్యక్షులు కళ్యాణ్ కుమార్, గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ నాయక్, పట్టణ కార్యదర్శి నారాయణ, ఐటి సెల్ కన్వీనర్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *