Friday, 16 October 2026

బీజేపీకి అన్నాడీఎంకే క‌టీఫ్‌ టీవీకేకు స‌పోర్ట్

newsseals-AIADMKShanmugamm

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కీల‌క నేత ష‌ణ్ముగం

చెన్నై : త‌మిళ‌నాడులో రాష్ట్ర రాజ‌కీయాలు కీల‌కంగా మారాయి. నిన్న‌టి దాకా బ‌ద్ద శ‌త్రువుగా ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఒక్క‌టి కాబోతున్నాయంటూ జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర దించారు ఏఐడీఎంకే సీనియ‌ర్ నాయ‌కుడు ష‌ణ్ముగం. మంగ‌ళ‌వారం త‌మ నివాసానికి చేరుకున్నారు భారీ భ‌ద్ర‌త మ‌ధ్య సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇదే స‌మ‌యంలో వీసీకే చీఫ్ తిరుమావ‌ళ్ల‌న్ ను క‌లిశారు. అంత‌కు ముందు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, వైగో, ఐయఎంల్ నేత‌ల‌ను కూడా మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ష‌ణ్ముగం మీడియాతో మాట్లాడారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

BJP-NDA కూటమికి గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు అన్నాడీఎంకే తిరుగుబాటు నేత ష‌ణ్ముగం. త‌మ‌దే అస‌లైన పార్టీ అని పేర్కొన్నారు. కీలక ఎమ్మెల్యేలు.. విజయ్‌కు మద్దతు ప్రకటిస్తున్న‌ట్లు తెలిపారు. ఇకపై NDA కూటమితో మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తాము ఆ కూటమి నుండి బయటకు వచ్చేశామన్నారు. అసలైన AIADMK మాదేనని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పళనిస్వామి DMKతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పళనిస్వామి చేసిన ప్రతిపాదనను తాము అంగీకరించ లేద‌న్నారు.. పళనిస్వామి మాకు వ్యతిరేకంగా వ్యవహరించారని మండిప‌డ్డారు .వరుస ఓటములకు పళనిస్వామే కారణం అని ఫైర్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *