newsseals.com
News

పార్టీ క్యాడ‌ర్ కు బ్యాన‌ర్లు, ఫ్లెక్సీ బోర్డులు పెట్టొద్దు

VijayaBhaskar May 12, 2026
newsseals-TVKParty
Spread the love

స్ప‌ష్టమైన ఆదేశాలు జారీ చేసిన టీవీకే పార్టీ

చెన్నై : త‌మిళనాడులో కొత్త‌గా కొలువు తీరింది టీవీకే పార్టీ. ఆ పార్టీకి చెందిన ప్ర‌ముఖ న‌టుడు, చీఫ్ ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న సీటు మీద కూర్చోగానే సంచ‌లనాల‌కు తెర తీశారు. పార‌ద‌ర్శ‌క‌, అవినీతి ర‌హిత పాల‌న చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇచ్చిన హామీల‌ను ద‌శ‌ల వారీగా అమ‌లు చేస్తామ‌న్నారు సీఎం. అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రార్థ‌నా మందిరాలు, ఆల‌యాలు, చ‌ర్చీలకు కిలోమీట‌ర్ దూరంలోనే మ‌ద్యం దుకాణాలు ఉండాల‌ని ఆదేశించారు. 2 వారాల లోపు 700కు పైగా ఉన్న మ‌ద్యం రిటైల్ షాపుల‌ను మూసి వేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

తాజాగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది సీఎం జోసెఫ్ సూచ‌న‌ల మేర‌కు . ప్రజా శ్రేయస్సును , ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పుట్టిన రోజులు లేదా కుటుంబ వేడుకల సందర్భాల్లో రోడ్లు, బహిరంగ ప్రదేశాలు లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో బ్యానర్లు గానీ, ఫ్లెక్సీ బోర్డులు గానీ ఏర్పాటు చేయవద్దని TVK తన పార్టీ కార్యకర్తలను ఆదేశించిందిజ ముఖ్యమంత్రి విజయ్ ఆమోదంతో, వేడుకలు లేదా బ్యానర్ల ద్వారా ప్రజలకు ఎవరైనా ఇబ్బంది కలిగించినట్లయితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆ పార్టీ హెచ్చరించింది.