ప్ర‌తిప‌క్షనేత‌ల‌తో క‌ర‌చాల‌నం సీఎం సంచ‌ల‌నం

VijayaBhaskar · May 12, 2026
Spread the love

మాజీ సీఎం స్టాలిన్, వైగో, సీమాన్ తో స‌మావేశం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూట‌మితో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే విజ‌య్ వ‌చ్చీ రావ‌డంతోనే కొత్త సంప్రాదాయానికి నాంది ప‌లికారు. రాజ‌కీయాలు అనేవి కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కేన‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న సీఎంగా కొలువు తీరిన వెంట‌నే నేరుగా స‌చివాల‌యంకు వెళ్లారు. అత్యంత స‌మ‌ర్థ‌వంతులైన‌, నీతి నిజాయితీ క‌లిగిన అధికారుల‌ను నియ‌మించుకున్నారు. అక్క‌డి నుంచి నేరుగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నివాసానికి వెళ్లారు. చాలా సేపు ఈ ఇద్ద‌రు మాట్లాడు కోవ‌డం క‌ల‌క‌లం రేపింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

అనంత‌రం మ‌రో అగ్ర నేత వైగో ఇంటికి స్వ‌యంగా వెళ్లారు. కుటుంబ స‌భ్యుల‌ను ప‌ల‌క‌రించారు. అక్క‌డి నుంచి న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు సీమాన్ ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు . అన్బుమణి రామదాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు సీఎం విజ‌య్. అందరితో సమన్వయంతో ముందుకు సాగుతాననే సంకేతాలను ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా కేంద్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తమిళనాడు సీఎం విజయ్‌కి Z+ కల్పించింది. 55 మంది కేంద్ర భద్రతా సిబ్బందితో 24 గంటల భద్రతను ఏర్పాటు చేసింది. సీఎం భద్రతా బృందంలో 10 మందికి పైగా NSG కమాండోలు ఉంటారు. వీరితో పాటు CRPF, CISF, ITBP సిబ్బంది కూడా ఉన్నారు.