బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

VijayaBhaskar · May 15, 2026
Spread the love

మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రిలో మెరుగైన చికిత్స

హైద‌రాబాద్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ త‌ల్లి శ‌కుంత‌ల అనారోగ్యానికి గురైంది. ఆమె కు గుండె పోటు రావ‌డంతో హుటా హుటిన హైద‌రాబాద్ లోని మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం శకుంతల గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బండి భాగీరథ’ కేసు సంబంధించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంతో శకుంతల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.మెడికవర్ ఆసుపత్రి వైద్యులు శకుంతలకు అత్యవసర చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా బండి సంజ‌య్ కుమారుడు బండి సాయి భగీర‌థ్ పై పోక్సో కేసు న‌మోదైంది . దీంతో దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచ‌ల‌నంగా మారింది. గ‌త కొన్ని రోజులుగా త‌ను పోలీసుల‌కు అందుబాటులో లేకుండా త‌ప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి సీఎం ఎ. రేవంత్ రెడ్డి సిట్ ను ఏర్పాటు చేశారు. కూక‌ట్ ప‌ల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ను విచార‌ణ అధికారిగా నియమించారు. మ‌రో వైపు త‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ కావాల‌ని కోరుతూ భ‌గీర‌థ్ త‌ర‌పున లాయ‌ర్ నిరంజ‌న్ రెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మోసం చేసిన వాడికి ఎలా మ‌ద్ద‌తు ఇస్తారంటూ జ‌నం మండి ప‌డుతున్నారు.