బండి భ‌గీర‌థ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్

VijayaBhaskar · May 17, 2026
Spread the love

పోలీసుల‌ను ఆదేశించిన న్యాయూమ‌ర్తి
హైద‌రాబాద్ : కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి సాయి భ‌గీర‌థ్ కు షాక్ త‌గిలింది. గ‌త 9 రోజులుగా త‌ప్పించుకు తిరుగుతున్న త‌న‌ను ఎట్ట‌కేల‌కు పోలీసుల ముందు లొంగి పోయేలా చేశారు . చివ‌ర‌కు ఈ విష‌యంలో సిట్ ను కూడా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌న ప‌రువు పోగొట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజ‌య్ కొడుకును ర‌క్షించేలా చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయి. ఇక త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ బండి కొడుకు త‌ర‌పున న్యాయ‌వాది నిరంజ‌న్ రెడ్డి వాద‌న‌లు వీగి పోయాయి. కేసును ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాను ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌లేనంటూ తేల్చి చెప్పింది. ఇక ర‌క్షిస్తాడ‌ని అనుకున్న రేవంత్ రెడ్డికి కూడా కోలుకోలేని దెబ్బ త‌గిలింది.

ఈ త‌రుణంలో అన్ని డోర్స్ క్లోజ్ కావ‌డంతో బండి సంజ‌య్ త‌న కొడుకును పోలీసుల ముందు లొంగి పోయేలా ప్లాన్ చేశాడు. అంత‌కు ముందు నాలుగు బృందాలు త‌న‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేశాయి. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే సీపీ ర‌మేష్ రెడ్డి మాత్రం తాము నిందితుడిని ప‌ట్టుకున్నామ‌ని, మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర్చ‌గా 14 రోజుల రిమాండ్ విధించిన‌ట్లు తెలిపారు. మొత్తంగా దేశం కోసం ధ‌ర్మం కోసం అంటూ గొంతులు తించుకునే బీజేపీ నేత‌లు ఎక్క‌డా క‌నిపించ‌కుండా పోయారు. ఇప్ప‌టికే దేశంలో అత్య‌ధిక పోక్సో కేసులు వీరి మీద‌నే న‌మోదు కావ‌డం విశేషం.