తనను ఎందుకు ఎన్ కౌంటర్ చేయకూడదు
హైదరాబాద్ : సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తనయుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు. మే 3వ తేదీన తనపై పోక్సో కేసు నమోదైతే 9 రోజుల తర్వాత తాత్సారం చేసి చివరకు తనంతకు తాను లొంగి పోయాడు. అయితే పోలీసులు మాత్రం తాము పట్టుకున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్బంగా నారాయణ మీడియాతో మాట్లాడాడు . పోలీసులు అరెస్ట్ చేశామని చెబుతుంటే మరో వైపు కేంద్ర మంత్రి మాత్రం తానే స్వయంగా తన సుపుత్రుడిని పంపించానని చెప్పడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.
డబ్బున్న వాళ్లకు ఒక న్యాయం పేదలకు ఇంకో న్యాయం అన్న రీతిలో ఈ కేసు వ్యవహారం నడిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. ఎందుకు ఇప్పటి వరకు పోలీసులు తాత్సారం చేశారనే దానిపై ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ ఒక్క కేసులో తెలంగాణ పోలీసులు తమ పరువును పోగొట్టుకున్నారని, వీరిపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయిందన్నారు . బండి భగీరథ్ తో పాటు తనను కాపాడేందుకు ప్రయత్నం చేయడం, ఆపై బాధితురాలి కుటుంబీకులను బహిరంగంగానే బెదిరంపులకు దిగిన బండి సంజయ్ పై కూడా కేసు నమోదు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. భగీరథ్ ను అరెస్ట్ చేయించకుండా కాంగ్రెస్ సర్కార్ తప్పు చేసిందన్నారు. ఎవరెవరినో ఎన్ కౌంటర్ చేశారు.. ఇతనిని ఎన్కౌంటర్ చేయమని ఎందుకు అడగడం లేదన్నారు.






