చెప్పులు మోసినోడికి చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తే ఎలా..?

నిప్పులు చెరిగిన రాజ్య‌స‌భ ఎంపీ రేణుకా చౌదరి

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు, రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఓ ఛాన‌ల్ తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్బంగా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.
చెప్పులు మోసిన వాడికి సుడా ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని ప్ర‌శ్నించారు. వాడికి ఏం అర్హత ఉందని మండిప‌డ్డారు. కాంగ్రెస్ పదవుల భర్తీపై రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. పార్టీలో ప్ర‌స్తుతం ఆమె తాజా కామెంట్స్ చ‌ర్చ‌కు దారితీసేలా చేశాయి.

ప్ర‌ధానంగా ప్ర‌స్తుతం రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి గా ఉన్న మ‌ల్లు భట్టి విక్ర‌మార్క‌ వర్గం నేతలపై కాంగ్రెస్ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఏ అర్హత ఉందని పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌కు ఖమ్మం సుడా ఛైర్మన్ ఇచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ నేతలకు అవకాశాలు అంద‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలా అయితే పార్టీ ఎలా మ‌నుగ‌డ సాగిస్తుంద‌ని ప్ర‌శ్నించారు రేణుకా చౌద‌రి. హూ ఇజ్ థట్ ఫెలో పువ్వాళ్ల దుర్గాప్రసాద్? ఒక వ్యక్తికి చెప్పులు, సంచులు మోసినోడంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *