బండి సాయి భగీరథ ఫోన్ డేటా తొలగింపు..?

ఐఫోన్‌కు మారిన నిందితుడు

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ త‌న‌యుడు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు వ్య‌వ‌హారం. ఇప్ప‌టికే 9 రోజుల త‌ర్వాత త‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌న కోసం స‌ర్కార్ ప్ర‌త్యేకంగా సిట్ వేసింది. ఆపై డీసీపీని ఉన్న‌తాధికారిగా నియ‌మించింది. అంతే కాదు త‌నను ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసింది. కానీ త‌నంత‌కు తానుగా లొంగి పోవ‌డం, మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర్చ‌డం, 14 రోజుల రిమాండ్ విధించ‌డం జ‌రిగింది.

ఇదిలా ఉండ‌గా జైలులో ఉన్న బండి భ‌గీర‌థ్ మామూలోడు కాదు. ఇప్ప‌టికే స‌వాల‌క్ష అవ‌ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్నాడు. టెక్నాల‌జీ ప‌రంగా అవ‌గాహ‌న ఉండ‌డంతో కేసు నమోదైన వెంటనే ఐఫోన్‌కు మారాడు నిందితుడు. ఆ ఫోన్‌లోని కీలక ఆధారాలు మాయం చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో వివరాల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు. ఆధారాలను ధ్వంసం చేయడానికి వంద రెట్లు శక్తివంతమైన సాంకేతికతను వినియోగించిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగ‌తోంది. ఆధారాల నాశనంలో తెర వెనుక ఉన్న సూత్రధారులపై దృష్టి సారించార‌ని, ఇదే క్ర‌మంలో బాధితురాలి ఫోన్ ద్వారా ఆధారాలు సేక‌రించేందుకు ఛాన్స్ ఉన్న‌ట్టు గుర్తించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *