ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ కు జ‌ర్న‌లిస్టుల జాబితా

అంద‌జేసిన జేసీహెచ్ఎస్ఎల్ ప్రెసిడెంట్ , స‌భ్యులు

హైద‌రాబాద్ : గ‌త కొంత కాలంగా జ‌ర్నలిస్టుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు పేరుకు పోయాయి. ఎన్ని ప్ర‌భుత్వాలు వ‌చ్చినా స్థ‌లాలు ఇస్తామ‌ని, ఇళ్లు కేటాయిస్తామ‌ని చెబుతూ వ‌చ్చారే త‌ప్పా ఆచ‌ర‌ణ‌లో అమ‌లు కాలేదు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల ప్ర‌భుత్వం పూర్తిగా జ‌ర్న‌లిస్టుల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు రాష్ట్రంలో ఉన్న జ‌ర్న‌లిస్టు సంఘాల‌న్నీ త‌మ త‌మ సంస్థ‌ల్లో ఉన్న జ‌ర్న‌లిస్టుల వివ‌రాల‌తో కూడిన జాబితాను త‌మ‌కు అంద‌జేయాల‌ని కోరింది. ఈ మేర‌కు జ‌ర్న‌లిస్ట్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (జేసీహెచ్ఎస్ఎల్) సోమ‌వారం స‌భ్యుల పూర్తి జాబితాను ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డికి అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో జ‌ర్న‌లిస్టు సంస్థ‌ అధ్యక్షుడు బ్ర‌హ్మాండ‌గిరి గోపరాజు, కార్యదర్శి రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జాయింట్ సెక్రటరీ డా. చల్లా భాగ్యలక్ష్మి, కోశాధికారి భీమగాని మహేశ్వర్, మాజీ కార్యదర్శి, ఎంసీ సభ్యులు హష్మీ, మేనేజింగ్ కమిటీ సభ్యులు కమలాకరా చార్య పాల్గొన్నారు. కాగా అంద‌జేసిన‌ జాబితాను ప్రభుత్వానికి అందజేస్తాన‌ని శ్రీనివాస్ రెడ్డి ఈ సంద‌ర్భంగా తెలిపార‌ని చెప్పారు ప్రెసిడెంట్ గోప‌రాజు. చెప్పిన సమయానికి జాబితా అందజేసిన మేనేజింగ్ కమిటీ సభ్యులను ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అభినందించిన‌ట్లు పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *