Friday, 16 October 2026

ప్రపంచంతో పోటీపడే ఎకో సిస్టమ్ నిర్మాణం

newsseals-LokeshNata

స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్ బాబు

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్‌వేర్, డ్రోన్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, అధునాతన తయారీ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తోంద‌ని చెప్పారు మంత్రి నారా లోకేష్‌. ఆధునిక ఆర్థిక వృద్ధి ఎకోసిస్టమ్స్, స్పెషలైజేషన్, ఆవిష్కరణల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, భారత ప్రభుత్వం కలిసి భవిష్యత్తు కోసం ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడగల ఎకో సిస్టమ్స్ ను నిర్మిస్తున్నాయని చెప్పారు. SAEL నాయకత్వంతో మొట్ట మొదటి సంభాషణ నాకు ఇప్పటికీ గుర్తుంద‌న్నారు. ఢిల్లీలో ఒక టెలికాం ఆపరేటర్ల సంఘం సమావేశం సందర్భంగా జరిగిందన్నారు. అది పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన సమావేశం కూడా కాదన్నారు.

కానీ ఆరోజు ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను నిర్మించాలనే తమ ప్రణాళికల గురించి SAEL నాయకత్వం ఎంతో ఉద్వేగంగా మాట్లాడిందన్నారు. వారి ఉద్దేశాన్ని నేను వెంటనే గ్రహించాన‌ని తెలిపారు నారా లోకేష్‌. రెన్యువబుల్ ఎనర్జీలో ఫలితాలను సాధించాలన్న SAEL సంస్థ దీర్ఘకాలిక ఆలోచన, వారి తపనను నేను పసిగట్టగలిగానని చెప్పారు. పంజాబ్ లీడర్ షిప్ నేతృత్వంలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు నిర్వహించగలదా? అనే ప్ర‌శ్న నాలో మెదిలింది. SAEL బృందం అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని, నన్ను కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *