ఆర్టీసీ డ్రైవ‌ర్ ను తొల‌గించ లేదు : పొన్నం

త‌ను ఆర్టీసీ ఉద్యోగి కానే కాద‌న్న రాష్ట్ర మంత్రి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది ఆర్టీసీకి చెందిన డ్రైవ‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీంతో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు పొన్నం ప్ర‌భాక‌ర్ . గిత్యాలలో రైతుల తరపున ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్‌ను విధుల నుండి తొలగించారని వార్తలు ప్రచారంలో ఉన్నాయని, అయితే ఇవి పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు మంత్రి.

ఆయన కేవలం ఒక RTC అద్దె (రెంటల్) బస్సు డ్రైవర్ మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. ఆయన RTC ఉద్యోగి కాద‌న్నారు. అయినప్పటికీ, ఆయన్ని ఉద్యోగం నుండి తొలగించ వద్దని తాము బస్సు యాజమాన్యానికి సూచించడం జ‌రిగింద‌ని చెప్పారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. అశోక్ రైతుల తరపున మాట్లాడారు, మేము ఆ విషయాన్ని స్వాగతిస్తున్నామ‌ని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. . అయినప్పటికీ, కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటోందని చెప్పారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని అన్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *