విశాఖ‌లో సైకిల్ తొక్కిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వ‌ర‌కు సైకిల్ యాత్ర

విశాఖ‌ప‌ట్నం : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఏది చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే. శుక్ర‌వారం ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్బంగా విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న యువ‌కుల‌కు ధీటుగా తాను కూడా సైకిల్ ఎక్కారు. ఏకంగా ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వ‌ర‌కు సైకిల్ యాత్ర చేప‌ట్టారు. ఆయ‌న వెంట వంద‌లాది మంది సైకిల్ తొక్కారు. ఈ యాత్ర కు మంచి స్పంద‌న ల‌భించింది. ఇదిలా ఉండ‌గా ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లల్లో చేరుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 75 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన సీఎం ఉత్సాహాన్ని చూసి మిగ‌తా టీడీపీ నేత‌లు, ఉన్న‌తాధికారులు విస్తు పోయారు.
.

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవోటెల్ చేరుకున్నారు ముఖ్యమంత్రి . ఎర్రటి ఎండ కాస్తున్నా ఉత్సాహంగా సైకిల్ తొక్క‌డం విశేషం. సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ సాగిన సైకిల్ ప్రయాణం. సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు వెంట జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడుతూ సైకిలింగ్ అనేది మ‌న జీవితంలో ఒక భాగం కావాల‌ని పిలుపునిచ్చారు.

  • Related Posts

    ఉత్తమ వీడియో జర్నలిస్ట్ అవార్డులకు ఆహ్వానం

    అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్తమ వీడియో జర్నలిస్ట్ అవార్డులకు దరఖాస్తు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌. వీడియో జర్నలిస్ట్ ప్రస్తుతం శాటిలైట్ లేదా కేబుల్ టీవీ నెట్‌వర్క్ వంటి ఎలక్ట్రానిక్…

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *