14.43 ల‌క్ష‌ల మంది రైతుల‌కు విజ‌య్ రుణ‌మాఫీ

VijayaBhaskar · June 16, 2026
Spread the love

తమిళనాడు ముఖ్య‌మంత్రి సంచలన నిర్ణయం
చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల హామీలో భాగంగా రైతుల‌కు రుణ మాఫీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఆ మేర‌కు బుధ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను రైతు ప‌క్ష‌పాతిన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు సీఎం.

త‌మిళ‌నాడు రాష్ట్రంలో స‌హ‌కార రంగంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌క్తిగ‌తంగా సాగు కోసం రుణాలు తీసుకున్న రైతుల‌కు ఒక్కొక్క‌రికి రూ.75,000 మేరకు వ్య‌వ‌సాయ రుణాలు మాఫీ చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14.43 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.5,932 కోట్ల మేర భారం పడనుంది. అయినా వెన‌క్కి త‌గ్గేది లేదంటూ స్ప‌ష్టం చేశారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.