ఏపీలో కురియనున్న భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి : నైరుతి రుతు పవనాలు ప్రారంభం అయ్యాయని, దీంతో భారీ ఎత్తున వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ హెచ్చరించింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఐఎండీ). రాగల మూడు గంటలు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అవసరమైతే తప్పా బయటకు రావద్దంటూ సూచించింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, రెడ్ అలర్ట్ ప్రకటించింది ఏపీ ఐఎండీ.
తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ హెచ్చరించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని పేర్కొంది. రాబోయే 24 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అతి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇదిలా ఉండగా ఏపీ ఎంఐడీ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.