ఏపీ కేంద్రంగా రేర్ ఎర్త్ మినరల్స్

ఎకో సిస్ట‌మ్ రావాల‌న్న సీఎం బాబు

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో అపార‌మైన వ‌న‌రులు ఉన్నాయ‌ని వాటిని ఉప‌యోగించుకునేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర స‌చివాల‌యంలో ఆయ‌న రేర్ ఎర్త్ మిన‌ర‌ల్స్ పై స‌మీక్ష చేప‌ట్టారు. ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన ఉన్న‌తాధికారుల‌తో పాటు సీఎస్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు సీఎం. రేర్ ఎర్త్ మినరల్స్ కు ఏపీ కేంద్రంగా మారాలన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ కు సంబంధించిన ఎండ్ టూ ఎండ్ సొల్యూషన్స్ ఏపీలో అందుబాటులో ఉండేలా ఎకోసిస్టమ్ ఉండాల‌న్నారు .

రేర్ ఎర్త్ మినరల్స్ పై ఓ ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో ఆలోచన చేయాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. జొన్నగిరి గోల్డ్ మైన్ 1000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. జొన్నగిరి అత్యంత పురాతన చరిత్ర ఉంది. ఒకప్పుడు జొన్నగిరికి స్వర్ణగిరి అని పేరుంది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. విశాఖ నగరంలో ప్రస్తుత సదుపాయాలను మరింత మెరుగు పరుస్తూనే.. శాటిలైట్ టౌన్ షిప్ లు అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. పరిశ్రమలతో పాటు.. హౌసింగ్ కూడా ఉండాలి. పారిశ్రామిక ప్రాంతాల వద్ద అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *