కావేరి అద‌న‌పు నీటి ప్రాజెక్టు చేప‌ట్టాలి

VijayaBhaskar · June 21, 2026
Spread the love

సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ కు విన‌తి

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖర్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ప్ర‌ముఖ నాయ‌కురాలు అన్బుమ‌ణి. ఈ సంద‌ర్బ‌గా ధర్మపురి కావేరి అదనపు నీటి ప్రాజెక్టును తక్షణమే అమలు చేసేలా ఆర్థిక నివేదికలో ప్రకటన చేయాలని కోరారు. ఇదే స‌మ‌యంలో ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఇదిలా ఉండగా త‌మిళ‌నాడులో కొలువు తీరిన సీఎం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ప్ర‌శంసించారు. అంతే కాకుండా ప్ర‌జ‌ల‌కు మేలు చేకూరేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం మామూలు విష‌యం కాద‌ని పేర్కొన్నారు అన్బుమ‌ణి.

గ‌తంలో ఉన్న డీఎంకే స‌ర్కార్ ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను, రాష్ట్రం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించు కోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రో వైపు కావాల‌ని ప‌క్క‌నే ఉన్న క‌ర్ణాట‌క క‌య్యానికి కాలు దువ్వుతోంద‌ని ఆరోపించారు. కేంద్ర న‌దీ జ‌లాల పంపిణీకి సంబంధించి నీటి విష‌యంలో ట్రైబ్యూన‌ల్ తీర్పున‌కు, సుప్రీంకోర్టు తీర్పున‌కు లోబ‌డి ఉండాల‌ని అన్బుమ‌ణి కోరారు. మ‌రోవైపు క‌ర్ణాట‌క స‌ర్కార్ అక్ర‌మంగా నిర్మించ‌బోయే ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు శాస‌న స‌భ‌లో తీర్మానం చేశారు. ఇందుకు సంబంధించి అన్ని పార్టీల నేత‌లు మూకుమ్మ‌డిగా తీర్మానం చేశారు.