ఐపీఎల్ లో మొదటి మూడు మ్యాచ్ ల వైఫల్యంపై
కేరళ : టీం ఇండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాక తాను ఆడిన తొలి మూడు మ్యాచ్ లలో వైఫల్యం చెందడం గురించి ప్రస్తావించాడు. గురువారం మూడు వరుస పేలవమైన మ్యాచ్‌ల తర్వాత ఎంఎస్ ధోనీ తనకు ఏం చెప్పారో సంజు వెల్లడించారు . నేను CSKలో చేరినప్పుడు, నా మొదటి మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యాను, ఆ మూడు మ్యాచ్‌లలోనూ జట్టు ఓడి పోయింది. ప్రపంచ కప్ ఫైనల్‌లో పరుగులు సాధించిన నేను, ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడుతున్నానా అని ఆలోచిస్తూ ఉండేవాడిని.
ఆ మూడు మ్యాచ్‌ల తర్వాత ‘మాహీ భాయ్’ నా దగ్గరకు రావడం నాకు గుర్తుంది. ఆయన నా వైపు చూసి, ‘నువ్వు బాగానే ఉన్నావా?’ అని అడిగారు. నేను, ‘అవును భయ్యా, నేను బాగానే ఉన్నాను, కానీ…’ అని చెప్ప బోయాను. నేను ఇంకా మాట్లాడక ముందే ఆయన, ‘ఆ ‘కానీ’ల జోలికి వెళ్లొద్దు. నీలో నువ్వు ముడుచుకు పోవద్దు (నిరుత్సాహ పడిపోవద్దు)’ అని అన్నారు. ఆ తర్వాత, నేను ఒక సెంచరీ సాధించాను, మేము ఆ మ్యాచ్ గెలిచాము, జట్టు పుంజుకుంది. చివరి మ్యాచ్ వరకు పోటీలో నిలిచామని అన్నాడు. టోర్నీలో సీఎస్కే తరపున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచానని అన్నాడు శాంసన్.







