తెలంగాణలో స్తంభించిన డిజిట‌ల్ సేవలు

హైద‌రాబాద్ : తెలంగాణ యాప్-బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (TADF) , తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సంయుక్త పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బ్రేక్‌డౌన్ ఫ్లాష్ సమ్మె తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3.90 లక్షల మంది గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికులు పాల్గొని తమ నిరసన వ్య‌క్తం చేశారు. ఈ సమ్మె ప్రభావంతో ఓలా, ఉబెర్, రాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, పోర్టర్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, సరుకు రవాణా వాహన చోదకులు, డెలివరీ బాయ్స్ సేవలు నిలిచి పోయాయి.

ఈ సంద‌ర్భంగా ప‌లు డిమాండ్లు ముందుంచారు. యాప్ ఆధారిత రవాణా సేవలకు కిలోమీటరు, నిమిషం రేట్లతో పాటు సరసమైన కనీస బేస్ ఛార్జీని వెంటనే నిర్ణయించాలని, తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల నియమాలను తక్షణమే నోటిఫై చేసి, ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కంపెనీలు ఏకపక్షంగా ఛార్జీలు, కమీషన్లు పెంచకుండా అగ్రిగేటర్ మార్గదర్శకాలు – 2025 ప్రకారం కనీస ఛార్జీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు TADF – TGPWU రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలావుద్దీన్.

సమ్మె కారణంగా తెలంగాణ ప్రజలకు, మా వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నామని అన్నారు. అయితే, యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ కార్మికులకు తమ హక్కుల కోసం పోరాడటం మినహా మరో మార్గం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం, ప్లాట్‌ఫామ్ కంపెనీలు త‌మ‌ డిమాండ్లను వెంటనే నెరవేర్చక పోతే, 2026 ఆగస్టు 8 తర్వాత ప్రతిపాదించిన నిరవధిక సమ్మెతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం అని హెచ్చ‌రించారు షేక్ స‌లావుద్దీన్. గిగ్ కార్మికులకు న్యాయమైన సంపాదన, సామాజిక భద్రత, పారదర్శక విధానాలు కల్పించేందుకు ప్రభుత్వం, కంపెనీలు తక్షణమే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

  • Related Posts

    ఉదయ్ కృష్ణ రెడ్డి కేసు సోమ‌వారానికి వాయిదా

    హైద‌రాబాద్ : ట్రైనీ ఐపీఎస్ ఉద‌య్ కృష్ణా రెడ్డి కేసు ను విచారించిన హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌న కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. ఇదిలా…

    ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ : స‌విత

    శ్రీ స‌త్య‌సాయి జిల్లా : దివంగ‌త సీఎం , అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా గురుకుల విద్య నాంది పలికారని చెప్పారు మంత్రి స‌విత . ఆయన స్పూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *