100 శాతం డిజిటైజేష‌న్ చేసిన వారికి స‌న్మానం

హైద‌రాబాద్ : రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హూజూర్ న‌గ‌ర్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్ ఓట్ల ప్ర‌క్రియ‌పై స్పందించారు. ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు నమోదు డిజిటైజేషన్ కార్యక్రమం పురోగతిపై వచ్చిన నివేదికను పరిశీలించానని అన్నారు. మన నియోజకవర్గం, పట్టణం, మండలం, గ్రామం , బూత్ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు (BLAs) అందరికీ నా హృదయ పూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ప్రతి బూత్‌లో కనీసం 95% ఓటరు నమోదు డిజిటైజేషన్ పూర్తి చేసే లక్ష్యంతో పని చేయాల‌ని కోరారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

ఇది కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు . ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు సక్రమంగా నమోదు కావడం, ఒక్క నిజమైన ఓటరు కూడా మిగిలి పోకుండా చూడడం మనందరి బాధ్యత అని స్ప‌ష్టం చేశారు . తమ తమ బూత్‌లలో 100% డిజిటైజేషన్ పూర్తి చేసిన కాంగ్రెస్ నాయకులు , బీఎల్‌ఏలను ఈ నెల 26వ తేదీన హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నా చేతుల మీదుగా ప్రత్యేకంగా సన్మానిస్తానని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. అందరం సమన్వయంతో, అంకితభావంతో పనిచేసి హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబెట్టాల‌ని పిలుపునిచ్చారు.

  • Related Posts

    ఏపీ హోం శాఖ మంత్రి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్

    అమ‌రావ‌తి : టెక్నాల‌జీ పెరిగినా నేరాలు ఆగ‌డం లేదు. టెక్నాల‌జీలోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకుని సైబ‌ర్ నేర‌స్థులు , హ్యాక‌ర్స్ రెచ్చి పోతున్నారు. ఓ వైపు బ్యాంకు ఖాతాల‌ను స్తంభింప చేస్తూ ఇబ్బందులు గురి చేస్తుండ‌గా మ‌రో వైపు సోష‌ల్ మీడియాలోని…

    ప‌రిమ‌ళ చ‌దువు కోసం కోమ‌టిరెడ్డి రూ. 10 ల‌క్ష‌ల‌ సాయం

    న‌ల్ల‌గొండ జిల్లా : మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాన‌వ‌త‌ను చాటుకున్నారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన,నిత్య కూలీ కుమార్తె , ప్రతిభావంతురాలైన విద్యార్థిని పరిమల జర్మనీలోని ఒక ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు సీటు వ‌చ్చింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *