జగన్ రెడ్డికి క్రెడిట్ చోరీ డిజాస్టర్ డిసీజ్
అమరావతి : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ , రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. బోగాపురం ఎయిర్ పోర్టు ప్రధాని ప్రారంభోత్సవానికి వస్తుంటే ఇప్పుడు నేనే తెచ్చానంటూ బయలు దేరాడు. లండన్ మందులు సరిగా పని చేయనట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గొడ్డలి పార్టీ అధినేతకు క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే జబ్బు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ మనం తెస్తే దావోస్ లో కలిసి తెచ్చా అంటున్నాడు. అదే నిజమైతే ఐదేళ్లు ఏంచేశారు? అని నిలదీశారు. ఆర్సెలర్ మిట్టల్ తెస్తే అది రాదు, పక్క రాష్ట్రానికి వెళ్లింది అంటాడు. తీరా వచ్చాక నేనే తెచ్చా అంటాడు. మరికొద్ది రోజులు పోతే ఆగస్టు 15 రోజున మా తాత వైఎస్ రాజారెడ్డి స్వాతంత్రం తెచ్చాడని కూడా చెబుతాడన్నాడు. ఇది క్రెడిట్ చోరీ డిజార్డర్ జబ్బు లక్షణం. కష్టపడి పని చేయడంతో పాటు చేసింది ప్రజలకు చెప్పడం కూడా ముఖ్యం అన్నారు.
ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు నారా లోకేష్. మనకు తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, తెలుగు రైతు, ఐటిడిపి వంటి అనుబంధ విభాగాలు ఉన్నాయని చెప్పారు. వైసిపికి కూడా గొడ్డలి, విధ్వంసం, బూతుల విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ హిట్ అండ్ రన్, భార్యను వేధించే సైకోలు, ల్యాండ్ డాక్యుమెంట్ల ఫోర్జరీ, కిడ్నాప్ బ్యాచ్ లు ఉన్నారని ఆరోపించారు. రెండు పార్టీలకు మధ్య తేడాను ప్రజలకు తెలియ జేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. గొడ్డలి పార్టీకి ఫేక్ ప్రచారం చేసే అద్భుతమైన విభాగం ఉంది. లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు నారా లోకేష్.