మీరు గతం యువతే దేశ భవిష్యత్తు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : లోక్ స‌భ‌లో ప్ర‌తిపక్ష నాయ‌కుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి రాచ‌రిక పాల‌న సాగిస్తున్నార‌ని ఆరోపించారు. రోజు రోజుకు ప్ర‌జాస్వామ్యం కుచించుకు పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, ఆ విష‌యం గుర్తిస్తే మంచిదంటూ రాహుల్ గాంధీ హిత‌వు ప‌లికారు. తాజాగా విద్యార్థులు న్యాయ ప‌ర‌మైన డిమాండ్ కోరార‌ని, కానీ కావాల‌ని వారిపై దాడుల‌కు పాల్ప‌డ‌డం, అన‌వ‌స‌ర‌మైన కేసులు బ‌నాయించ‌డం త‌ప్పు అన్నారు. దీనిని తమ‌తో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఖండిస్తున్నాయ‌ని అన్నారు ఎంపీ.

మోదీ , అమిత్ షా జెన్-జెడ్’ (Gen Z) గొంతు నొక్కే ప్రయత్నాలు చేయడం మానుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఇద్ద‌రూ బెదిరింపుల‌కు దిగ‌డం దారుణ‌మ‌న్నారు. యువ‌త గొంతు నొక్కే ప్ర‌య‌త్నం చేయాల‌ని అనుకోవడం భ్ర‌మ త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు రాహుల్ గాంధీ . ఆందోళనకర పరిస్థితుల్లో యువతపై లాఠీచార్జ్ చేసి వారి ఎముకలు విరగ్గొట్టార‌ని ఆవేద‌న చెందారు. ఇప్పుడు వారిపై కేసులు (FIRలు) నమోదు చేస్తూ, సోషల్ మీడియా ఖాతాలను నిలిపి వేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. మీరు గ‌తం మాత్ర‌మేన‌ని రాబోయే దేశ భ‌విష్య‌త్తు అంతా యువ‌త చేతుల్లోనే ఉంటుంద‌ని ప్ర‌కటించారు.

  • Related Posts

    కుప్పంను ఆద‌ర్శ నియోక‌వ‌ర్గంగా మారుస్తాం

    చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ చేస్తాన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే వంద‌ల కోట్ల రూపాయల నిధులు కేటాయించామ‌న్నారు. ప‌లు అభివృద్ది ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు.…

    80 శాతం సబ్సిడీతో1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో రైతుల పంట‌ల సాగుకు సంబంధించి 80 శాతం స‌బ్సిడీతో 1.31 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ. 60 కోట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *