కావేరీ స‌మ‌స్య‌పై స‌ర్కార్ అత్య‌వ‌స‌ర స‌మావేశం

బెంగ‌ళూరు : కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అధ్యక్షతన ఆదివారం బెంగ‌ళూరులో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ రోజు జరిగిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో య‌డ్యూర‌ప్ప‌, వీర‌ప్ప మొయిలీ, మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌, బ‌స‌వ‌రాజ్ బొమ్మైతో పాటు ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఈ కావేరీ నీటి వివాదం ఇప్ప‌టి నుంచి లేద‌ని, గ‌త కొన్ని త‌రాల నుండి కొన‌సాగుతూ వ‌స్తున్న‌ద‌ని పేర్కొన్నారు ఈ సంద‌ర్బంగా సీఎం డీకే శివ‌కుమార్.

నేల, నీరు, భాషకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు, పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా నిలవడం కర్ణాటక రాజకీయ సంప్రదాయం అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు . గతంలో అధికారంలో ఉన్న పార్టీలు అనేకసార్లు ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయని కూడా అన్నారు. ఆ సందర్భాలలో ప్రతిపక్ష పార్టీలు అండగా నిలిచాయ‌ని పేర్కొన్నారు సీఎం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా, రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక సూచనలు చేస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయని నాకు నమ్మకం ఉందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    కొత్త స‌చివాల‌యం ఎవ‌రి కోసం ..? : ఎంకే స్టాలిన్

    చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చెన్నై వేదిక‌గా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా త‌మిళ‌నాడు టీవీకే స‌ర్కార్ ప్ర‌తిపాదించిన కొత్త స‌చివాల‌యం ఎవ‌రి కోస‌మ‌ని ప్ర‌శ్నించారు. బీచ్ సమీపంలో…

    కుప్పంను ఆద‌ర్శ నియోక‌వ‌ర్గంగా మారుస్తాం

    చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ చేస్తాన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే వంద‌ల కోట్ల రూపాయల నిధులు కేటాయించామ‌న్నారు. ప‌లు అభివృద్ది ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *