గిగ్ కార్మికుల సమ్మె ప్ర‌క‌ట‌న‌పై స‌ర్కార్ అత్య‌వ‌స‌ర స‌మావేశం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది గిగ్ ప్లాట్ ఫార‌మ్ వ‌ర్క‌ర్స్ సంఘాల ప్ర‌తినిధుల‌తో. అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి 10 నిమిషాల డెలివరీ ఆప్షన్‌ను తొలగించి, పాత చెల్లింపుల విధానాన్ని పునరుద్ధరించాలని టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు షేక్ స‌లావుద్దీన్ పిలుపునిచ్చారు. ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ , ఇతర ప్లాట్‌ఫారమ్ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు అధీకృత ప్రతినిధులు, సంబంధిత రికార్డులతో హాజరు కావాలని ఆదేశించారు. ఆగస్టు 8 నుంచి గిగ్ , ప్లాట్‌ఫారమ్ కార్మికులు పిలుపునిచ్చిన నిరవధిక సమ్మెకు ముందు తెలంగాణ కార్మిక శాఖ ప్రధాన ప్లాట్‌ఫారమ్ కంపెనీలతో అత్యవసర సంయుక్త సయోధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) , తెలంగాణ యాప్-బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (టీఏడీఎఫ్) సమర్పించిన వినతిపత్రాల తర్వాత ఈ సమావేశం జరిగింది.

ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ , ఇతర ప్లాట్‌ఫామ్ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు అధీకృత ప్రతినిధులు , సంబంధిత రికార్డులతో హాజరు కావాలని ఆదేశించారు. టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ప్రకారం నిరవధిక సమ్మెకు ముందు జరుగుతున్న చివరి ప్రభుత్వ స్థాయి రాజీ సమావేశం ఇది. ఈ సమావేశం ఫలితం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది గిగ్, ప్లాట్‌ఫామ్, యాప్ ఆధారిత క్యాబ్, ఆటో , డెలివరీ కార్మికుల తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. వేతనాలు, సంక్షేమం , పని పరిస్థితులకు సంబంధించిన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను కార్మిక సంఘాలు లేవనెత్తాయి.

అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుండి 10 నిమిషాల డెలివరీ ఆప్షన్‌ను తొలగించాలని, పాత చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించాలని టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. గిగ్ వర్కర్ల (gig workers) తరపున మూడు ప్రధాన డిమాండ్లను వెల్లడించారు. మొదటిది, రవాణా ఛార్జీలను వెంటనే పెంచాలని కోరుతున్నామ‌న్నారు. ‘గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యాక్ట్’ (చట్టం) ఆమోదం పొందినప్పటికీ, దానికి సంబంధించిన నిబంధనలు , బోర్డు ఇంకా అమలులోకి రాలేదన్నారు. కాబట్టి ఆ బోర్డును , నిబంధనలను వెంటనే అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు షేక్ స‌లావుద్దీన్. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలు చేయని ‘మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు (2020 , 2025)’ను వెంటనే అమలు చేయాలన్న‌ది త‌మ ప్ర‌ధాన డిమాండ్ అని పేర్కొన్నారు స‌లావుద్దీన్.

  • Related Posts

    సోనియా గాంధీ కేసు మెజిస్ట్రేట్ కు అప్ప‌గించిన కోర్టు

    న్యూఢిల్లీ : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసును తిరిగి మేజిస్ట్రేట్‌కు అప్పగించంది ఢిల్లీ కోర్టు. మేజిస్ట్రేట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులో తగిన కారణాలు లేవని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కొత్తగా…

    డీఎస్సీ స్కాంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి

    విజ‌య‌వాడ : డీఎస్సీ స్కాంపై CBI విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని YSRCP డిమాండ్ చేసింది. కుంభకోణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు నిష్పాక్షికమైన విచారణ జరపాలని , ఇందుకు బాధ్య‌త వ‌హిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *