ప్రతి నాయకులుగా హీరోయిన్లు పోషించగలరు
హైదరాబాద్ : నటీమణులు కూడా శక్తివంతమైన ప్రతినాయక పాత్రలు పోషించగలరని హేమంత్ మధుకర్ అభిప్రాయపడ్డారు. ‘పుష్ప’ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ‘అనగనగా ఒక ధీరుడు’లో లక్ష్మి మంచు వంటి తెలుగు నటీమణులు, ఇటువంటి పాత్రలు ఒక నటి నటన పరిధిని ఎలా విస్తరించగలవో నిరూపించారు. ఇటీవల మలయాళ నటి స్వస్విక విజయ్ ‘ఇరుముడి’ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించారు. పాఠశాల విద్యార్థులలో వణుకు పుట్టించే కఠినమైన ఉపాధ్యాయురాలిగా ఆమె నటన ప్రశంసలు అందుకుంది. ఇటువంటి పాత్రలు నటీమణులకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తాయని దర్శకుడు హేమంత్ మధుకర్ భావిస్తున్నారు. నటీమణులు ఎందుకు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించ కూడదు? అని ప్రశ్నించే ఆయన, వైవిధ్య భరితమైన పాత్రలను పోషించడంలో మహిళలు కూడా సమాన సామర్థ్యం కలిగి ఉన్నారని నమ్ముతారు.
స్వస్విక పాత్ర ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక పురుష నటుడు మరియు స్త్రీ నటి ఇటువంటి పాత్రను పోషించినప్పుడు ఉండే తేడా ఇదే. ఎందుకంటే ఒక మహిళ అటువంటి ప్రవర్తనను ప్రదర్శిస్తుందని మనం సాధారణంగా ఊహించము అని ఆయన పేర్కొన్నారు. ‘పడయప్ప’లో రమ్యకృష్ణ, ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి నటీమణులు నెగటివ్ పాత్రల విషయంలో ప్రమాణాలను పెంచారని, అలాగే యువ నటీమణులు అటువంటి పాత్రలను ప్రయత్నించేలా ప్రోత్సహించారని ఆయన భావిస్తున్నారు. ఒక అగ్రశ్రేణి నటి అటువంటి పాత్రను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినప్పుడు, మరికొంత మంది నటీమణులు కూడా దానిని ప్రయత్నించడానికి ఆసక్తి చూపిస్తారు. ‘పొగరు’ చిత్రంలో శ్రీయా రెడ్డి వంటి తమిళ నటీమణులు, అలాగే ‘క్రాక్’, ‘వీర సింహారెడ్డి’ వంటి తెలుగు చిత్రాల్లో వరలక్ష్మి శరత్‌కుమార్ అద్భుతంగా నటించారు.
మహిళలు శక్తివంతమైన ప్రతినాయక పాత్రలను సమర్థవంతంగా పోషించగలరని రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు దీటుగా నిలవగలరని వీరు నిరూపించారు అని ఆయన వివరించారు. పెద్ద స్టార్ల సినిమాల్లో తరచుగా పురుష ప్రతినాయకులకే ప్రాధాన్యత ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు చిత్ర నిర్మాతలు నటీమణులకు నెగటివ్ పాత్రలు పోషించే అవకాశాన్ని కల్పిస్తున్నారు,