స్వతంత్ర భరద్వాజ్‌కు ఒక రోజు పోలీస్ కస్టడీ
న్యూఢిల్లీ : హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు షాక్ తగిలింది. ఒక దాడి ఘటనకు సంబంధించి తనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట నిరసన చేపట్టిన కొద్ది గంటలకే బులాంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. స్వతంత్ర భరద్వాజ్‌ను శనివారం ఢిల్లీ కోర్టులో హాజరు పరచగా, కోర్టు అతన్ని ఒక రోజు పోలీస్ కస్టడీకి పంపింది. జంతర్ మంతర్ వద్ద CJP ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఒక మైనర్ కార్యకర్త తండ్రిపై జరిగిన దాడికి సంబంధించి, భరద్వాజ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR)లో ఢిల్లీ పోలీసులు ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన సెక్షన్లను చేర్చారు. అతనిపై పోక్సో (POCSO) కేసు కూడా నమోదైంది.
జూలై 20 నాటి నిరసనలో మైనర్ కార్యకర్త తండ్రి తల పగల గొట్టానని, రాజకీయ సంబంధాల వల్ల అరెస్టు నుండి తప్పించు కున్నానని భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. నేను తల పగలగొట్టాను… ఈ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందో తెలుసా? సెక్షన్ 307. అతనికి 60 కుట్లు పడ్డాయి అని భరద్వాజ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. బాధితుడికి అయిన గాయాలు “సాధారణ”మైనవని, అవి ఉక్కు కంకణం (బ్రేస్‌లెట్) వల్ల కలిగాయని ఢిల్లీ పోలీసులు ఇంతకుముందు పేర్కొన్నారు. ఆ తర్వాత భరద్వాజ్ ఒక పాడ్‌కాస్ట్‌లో తాను ఆత్మరక్షణలో భాగంగానే అలా చేశానని చెప్పుకున్నారు. మైనర్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్’ (POCSO) చట్టం కింద కొత్త ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.