నటి నయనతారతో పీవీ సింధు భేటీ
చెన్నై : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణఙ పీవీ సింధు సంచలనంగా మారారు. చెన్నై వేదికగా ప్రముఖ నటి, సౌత్ ఇండియా అమితాబ్ బచ్చన్ నయనతారతో సమయం గడిపారు. చెన్నైలో ఉన్న డబుల్ ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు లేడీ సూపర్ స్టార్ నయనతారను కలిసి వారితో ఆనందంగా సమయం గడిపారు. వీరిద్దరి కుటుంబాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింధు ఆ ఫోటోలను పంచుకుంటూ ఇలా రాశారు. అందమైన సాయంత్రం. అద్భుతమైన భోజనం. మనసు విప్పి మాట్లాడు కోవడం , అంతులేని నవ్వులు. కొన్ని విందులు వ్యక్తుల పట్ల మనకున్న దృక్పథాన్ని ఎలా మారుస్తాయో ఆశ్చర్యంగా ఉంటుంది.
స్నేహితులుగా వెళ్తాం, జీవితం, ప్రేమ మరెన్నో విషయాల గురించి మాట్లాడుకుంటాం. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఎప్పటి నుంచో ఒకరికొకరు తెలిసినట్లుగా అనిపిస్తుంది అని పేర్కొంది పీవీ సింధు.నాకు ఎంతో ఇష్టమైన నయనతారతో అక్కడ ఉండటం వల్ల చెన్నై ఎప్పుడూ నాకు సొంత ఇంటిలా అనిపించిందని తెలిపింది. కానీ ఈ సాయంత్రం తర్వాత, అక్కడ నా కోసం మరికొంత కుటుంబం వేచి ఉన్నట్లు అనిపిస్తోంది. విక్కీ, నయన్ ఇద్దరూ కీలక వ్యాఖ్యలు చేశారు. నయనతార మీపై ఎంతో ప్రేమ ఉంది అని పేర్కొనగా, విగ్నేష్ శివన్ మీరు చాలా స్వీట్ (అద్భుతమైన). మా తరపున ఎప్పుడూ ఎంతో ప్రేమ ఉంటుంది అని స్పందించారు. వృత్తి పరంగా చూస్తే నయనతార చివరిగా ‘టాక్సిక్’ (Toxic) చిత్రంలో కనిపించారు, కానీ అందులో ఆమె పాత్ర సరిగా తీర్చిదిద్దబడలేదు.