newsseals.com

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తేదీల‌తో క్యాలెండ‌ర్

September 11, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్షేమ పథకాల అమలు తేదీలతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. నేత , హస్తకళల కేంద్రాలను ‘అనుభవ కేంద్రాలు’గా (experience centres) మార్చాలని, కుల వృత్తులకు విలువను జోడించేలా కార్యాచరణ ప్రణాళికను చేపట్టాలని అన్నారు. వివిధ సంక్షేమ పథకాల అమలు తేదీలను సూచించే సంక్షేమ క్యాలెండర్‌ను రూపొందించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని పేర్కొన్నారు. ఎనిమిదవ కలెక్టర్ల సమావేశంలో ప్రసంగిస్తూ సంక్షేమ పథకాల ద్వారా పొందిన డబ్బును ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. వివిధ సంక్షేమ పథకాల అమలు తేదీల సమాచారంతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించండి. పేదల సాధికారత కోసం సంక్షేమ ఫలాలు ఎటువంటి అంతరాయం లేకుండా అందాలి అని అన్నారు.

అలాగే, కులవృత్తులకు విలువను జోడించేలా కార్యాచరణ ప్రణాళికను చేపట్టాలని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు. నేత , హస్తకళల కేంద్రాలను ‘అనుభవ కేంద్రాలు’గా మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొత్త పింఛన్ల మంజూరుకు ముందు కుటుంబాలను ఒక యూనిట్‌గా పరిగణించి మ్యాపింగ్ చేయాలని అన్నారు. పెద్ద కుటుంబాలకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించేలా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. రేషన్ , పింఛన్ కోసం కుటుంబాలు విడిపోకూడదని, అవి “సూక్ష్మ కుటుంబాలు”గా (micro families) మారకూడదని నాయుడు నొక్కి చెప్పారు. సంక్షేమం కోసం కేటాయించిన రూ. 1.5 లక్షల కోట్లలో, రూ. 75,000 కోట్లు పింఛన్లకే ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

Related News