newsseals.com

గ‌ణేశ్ ఉత్స‌వాలకు భారీ భ‌ద్ర‌త క‌ల్పించాలి

September 13, 2026 · VijayaBhaskar

అమరావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం నుంచి వినాయ‌క మండపాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ ఆయా జిల్లాల ఎస్పీల‌తో హోం శాఖ మంత్రి టెలి కాన్ఫ‌రెన్స్ చేప‌ట్టారు. వివిధ అంశాలపై ఎస్పీలతో సుదీర్ఘంగా చర్చించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఉత్సవాలకు అనుమతుల జారీపై ఎస్పీలతో చర్చించారు. అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు అనిత వంగ‌ల‌పూడి.

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గణేష్ మండపాలు, ఊరేగింపుల విషయంలో నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన శాంతిభద్రతల సమీక్షపై ఎస్పీలతో చర్చించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండ కూడదని ఎస్పీలకు స్పష్టం చేశారు హోం మంత్రి అని వంగ‌ల‌పూడి.

Related News