newsseals.com

మ‌హిళా కానిస్టేబుల్ కు మంత్రి అభినంద‌న‌

September 25, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ ను ప‌రిర‌క్షించ‌డంలో ఏపీకి చెందిన పోలీసులు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అనకాపల్లి జిల్లాలో విధి నిర్వహణతో పాటు క్రీడలలోనూ అద్భుతమైన ప్రతిభను కనబరిచిన మహిళా కానిస్టేబుల్ వి. విజయను నక్కపల్లిలోని ఆమె నివాసంలో సత్కరించారు ఈ సంద‌ర్బంగా మంత్రి. త‌న‌ను స‌త్క‌రించ‌డమే కాకుండా అభినందించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలలో ఆరు స్వర్ణ పతకాలు సాధించడం విజయ సాధించిన గొప్ప విజయం అని పేర్కొన్నారు.

అదే విధంగా,విధి నిర్వహణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ విశేష సేవలందిస్తున్న కానిస్టేబుల్ రాంబాబును కూడా స‌త్క‌రించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌. అలాగే అవయవదానం చేయడం ద్వారా మానవీయ విలువలను చాటిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావును ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. ఇలాంటి చ‌ర్య‌లు , తీసుకునే నిర్ణ‌యాలు స‌మాజానికి ఎంతో మేలు చేకూర్చేలా చేస్తాయ‌ని అన్నారు. రాబోయే రోజుల్లో వీరిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల‌కు పిలుపునిచ్చారు వంగ‌ల‌పూడి అనిత‌. త‌మ ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌ర్వాత లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ లో ఉంద‌న్నారు.

Related News